15 April, 2026 | 4:35 AM

అంబేద్కర్ అసలు వారసులం మేమే

14-04-2026 12:58 PM

అంబేద్కర్ విగ్రహం శుభ్రం చేశారు.. నివాళులు అర్పించారు..!

జేబులో ఉన్న డబ్బులతో పూలదండ కొన్నారు..!

షాద్‌నగర్,(విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో ఉన్న అంబేద్కర్  విగ్రహాన్ని ఎవరు పట్టించుకోలేదు.. ఆయన జయంతి సందర్భంగా 9వ తరగతి చదువుతున్న పాఠశాల విద్యార్థులే విగ్రహాన్ని నీళ్లతో శుభ్రం చేశారు. తమ జేబులో ఉన్న కొన్ని డబ్బులను అందరు ఒకే దగ్గర సమకూర్చికొని పూలదండను  తెచ్చుకున్నారు అదే పూలదండతో ఆయనకు ఘన నివాళి అర్పించి ఆయన ఆశయం కోసం కృషి చేయాలని అంటున్నారు అసలైన అంబేద్కర్ వారసులు ఈ చిన్నారులు అనే విధంగా నివాళులు అర్పించారు..