కడ్పల్ లో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు
సిర్గాపూర్,(విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండల పరిధిలోని కడ్పల్ గ్రామంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మల్లగారి విమల విట్టల్ రెడ్డి మాట్లాడుతూ... అణగారినవర్గాల అభ్యున్నతికి అహర్నిశలు శ్రమించిన మహనీయులు అంబేద్కర్ అన్నారు. ఆయన పీడిత ప్రజల పక్షాన పోరాడిన విశ్వమానవుడు, సబ్బండ వర్గాల ప్రజలకు హక్కులు పంచిన సమ సమాజ స్వాప్నికుడు, భారత రాజ్యాంగానికి రూపకల్పన చేసిన మహా మేధావి అంబేద్కర్ అన్నారు. ఆర్టికల్ 3 ద్వారా తెలంగాణ ప్రజల స్వరాష్ట్ర ఆకాంక్షను నెరవేరేలా చేసిన దార్శనికుడు బాబా సాహెబ్ అంబేద్కర్ అన్నారు. ఆయన భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆ మహోన్నతుడికి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ గూడూరి రమేష్, అంబేద్కర్ సేవ సమితి వారు, యువకులు, నాయకులు, వార్డు మెంబర్స్ ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.






