ఈనెల 15 నుండి చౌడలమ్మ విగ్రహ ప్రతిష్ట ఉత్సవాలు
కొండపాక: కొండపాక మండలం దుద్దెడ గ్రామంలో ఈనెల 15 నుంచి 23 వరకు యాదవ సంఘం ఆధ్వర్యంలో చౌడలమ్మ నూతన విగ్రహ ప్రతిష్ట ఉత్సవాలు నిర్వహించనున్నట్లు దేవాలయ కమిటీ గౌరవ అధ్యక్షులు నూనె కుమార్ యాదవ్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గ్రామంలో చౌడలమ్మ నూతన విగ్రహ ప్రతిష్ట ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈనెల 15న మైలలు తీయుట, 16న పోచమ్మ, బోనాలు, 18న గురు ప్రార్థన, గోపూజ, గణపతి పూజ, పుణ్యాహవచనము, పంచగవ్య మేళన, యాగశాల ప్రవేశం, మండపదేవతల పూజ, అగ్ని ప్రతిష్ట తో ఉత్సవాలు ప్రారంభమవుతాయన్నారు.
19న మండప దేవతల పూజ, జలాధివ, ఉద్వాసన హవాహిత దేవత హోమాలు, మూల మంత్ర హోమాలు,20న చౌడాలమ్మ విగ్రహ ప్రతిష్ట, 21న లంద జోగు,23న చౌడాలమ్మ దేవి కళ్యాణం, ఓడిబియ్యం పోయిట, గావు పట్టుట,24న విందు కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో దుద్దెడ యాదవ సంఘం సభ్యులు, యాదవులు, దుద్దెడ గ్రామంలోని ప్రజలు, పరిసర ప్రాంత భక్తులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గోపి కృష్ణ యాదవ సంఘం, ఆలయ కమిటీ చైర్మన్ గుండెలి ఆంజనేయులు, జక్కుల ఓజయ్య, కనకయ్య, నూనె శేఖర్, గుర్రాల కనకయ్య తదితరులు పాల్గొన్నారు.






