15 April, 2026 | 2:38 AM

బాలాజీనగర్ లో అంబేద్కర్ జయంతి వేడుకలు.

14-04-2026 09:55 PM

నవచైతన్య యూత్ ఆధ్వర్యంలో

మున్సిపాలిటీ పరిధిలోని 7వార్డు, 8 వార్డు లలో

కోదాడ,(విజయక్రాంతి): మున్సిపాలిటీ పరిధిలోని బాలాజీ నగర్ లో నవ చైతన్య యూత్ ఆధ్వర్యంలో డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ 135వ జయంతి మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా  బాలాజీ నగర్ లోని అంబేద్కర్ విగ్రహానికి పలువురు నాయకులు, అధికారులు, యూత్ సభ్యులు పూలమాల వేసి ఘన నివాళులు అర్పించి మాట్లాడారు. రాజ్యాంగం ద్వారా సామాన్యుడికి హక్కులు కల్పించిన మహనీయుడు అంబేద్కర్ అని కొనియాడారు. ఆయన చూపిన బాటలో నడవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు చైతన్య నాయక్, ఉదయశ్రీ హరిప్రసాద్, మాజీ కౌన్సిలర్ సైదా నాయక్,  ఉద్యోగ సంఘ ప్రతినిధులు , నవ చైతన్య యూత్ నాయకులు నాగేంద్ర నాయక్, రాము నాయక్ తదితరులు పాల్గొన్నారు.