1 July, 2026 | 7:57 PM

Breaking News

ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •   ఇందిరా శక్తి క్యాంటీన్లో భోజనం చేసిన కలెక్టర్   •   ఎర్రుపాలెంలో శాతవాహన సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ తాత్కాలిక నిలుపుదలకు అనుమతి   •   బోనమెత్తిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయ రమణారావు   •   ఎర్రుపాలెం ఎంపీడీవోగా బాధ్యతలు చేపట్టిన ఎం.శారద   •   కంచర్లలో తాగునీటి సమస్యకు పరిష్కారం   •   శ్రీ ఉమామహేశ్వరంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ప్రత్యేక పూజలు   •   విజయ క్రాంతి వార్తకు స్పందన మొలకెత్తని సోయాబీన్ పొలాలను పరిశీలించిన అధికారులు   •   డిబిఎమ్ 6 కాల్వకు గండి   •   ఓస్ట్‌ఫాలియా యూనివర్సిటీతో శాతవాహన అవగాహన ఒప్పందం   •  

గరిడేపల్లిలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

14-04-2026 06:32 PM

* అంబేద్కర్ ఆలోచనలు ప్రపంచానికే ఆదర్శం

గరిడేపల్లి,(విజయక్రాంతి): గరిడేపల్లి మండలంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతిని మంగళవారం ఘనంగా నిర్వహించారు.మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయం, తహసిల్దార్ కార్యాలయం, పోలీస్ స్టేషన్ తో పాటు మండలంలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాలను అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. మండలంలోని అనేక గ్రామాల్లో ఉన్న అంబేద్కర్ విగ్రహాల వద్ద పలు యువజన సంఘాలు, ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఎంపీడీవో కార్యాలయంలో మండల పరిషత్ అధికారి సరోజ, తాసిల్దార్ కార్యాలయంలో తహసిల్దార్ స్రవంతి, పోలీస్ స్టేషన్లో ఎస్సై చలికంటి నరేష్, మండలంలోని అన్ని గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో ప్రస్తుత సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, మాజీ ప్రజా ప్రతినిధులు, యువజన సంఘాల నాయకులు, ఎమ్మార్పీఎస్ నాయకులు, సంఘాల సభ్యులు, వివిధ శాఖలకు చెందిన ప్రభుత్వ అధికారులు, వివిధ రాజకీయపార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు.