1 July, 2026 | 6:42 PM

Breaking News

ప్రైవేటు పాఠశాలలో పుస్తక దోపిడిని అరికట్టాలి: ఏబీవీపీ   •   బుగ్గపాడు ఫుడ్ పార్క్ భూసేకరణ, నిధుల గోల్‌మాల్‌పై అధికార పార్టీ, టీజీఐఐసీ అధికారులు సిద్ధమా: భాస్కర్ణి వీరంరాజు   •   రైతుల శ్రేయస్సుకు సహకార సంఘాలు కృషి చేయాలి   •   ధూప దీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా శేషం శ్రీనివాసాచార్యులు   •   ప్రభుత్వ కళాశాలకు కంప్యూటర్ను అందించిన ఎన్నారై భాస్కర్ రెడ్డి   •   నెలరోజుల్లో అర్హులకు ఇండ్లు ఇవ్వకపోతే ఆక్రమిస్తాం   •   గజ్వేల్ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ   •   సింగరేణి ప్రధాన ఆసుపత్రిలో జాతీయ డాక్టర్ల దినోత్సవవేడుకలు-2026   •   ప్రభుత్వ పాఠశాలలకు డ్యుయల్ డెస్క్ బెంచీల పంపిణీ   •   సింగరేణి హెడ్ ఆఫీస్ నందు కేంద్ర కార్మిక సంఘాల నిర్వహించిన మహా ధర్నా విజయవంతం   •  

బిజెపి ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు

14-04-2026 06:35 PM

నిర్మల్,(విజయక్రాంతి): డా. బాబా సాహెబ్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా నిర్మల్ జిల్లా కేంద్రంలోని ట్యాంక్ బండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి బీజేపీ నాయకులు పూల మాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు దేశానికి, సమాజానికి చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఆ మహనీయుడు చేసిన సేవలు మరువలేనివనివని అన్నారు. హిందూ ధర్మ పరిరక్షణకు సైతం వారు కృషి చేసినట్లు తెలిపారు.

అంబేద్కర్ గారి ఆశయ సాధనకు ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని బీజేపీ నేతలు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు మెడిసమ్మె రాజు, పట్టణ అధ్యక్షులు ఆకుల కార్తీక్, సుంకరి సాయి, కౌన్సిలర్లు సాధం అరవింద్, శ్రీరామోజీ నరేష్, కూన శశాంక్, కృష్ణమోహన్, ముత్యం, ధర్మాజీ గారి ఈశ్వర్, సూరజ్ నాయక్, విఠల్, సాత్విక్, అర్జున్, జింక సూరి, ఖమ్మం సురేందర్, గంజి రాజు, పట్టణ బీజేపీ నాయకులు పొన్నం నారాయణ గౌడ్, చరణ్ మౌర్య, గిల్లీ విజయ్, పుదరి రంజిత్,  నేరేల్ల సాయి, సంతోష్, లింగయ్య, తో పాటు తదితరులు పాల్గొన్నారు.