10 April, 2026 | 2:13 AM

దాహార్తి తీర్చేందుకు అంబలి కేంద్రం ఏర్పాటు

10-04-2026 12:29 AM

వనపర్తి, ఏప్రిల్ 9 ( విజయక్రాంతి ) : వనపర్తి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి సౌజన్యంతో అంబలి కేంద్రం, చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. గురువారం వనపర్తి మున్సిపల్ చైర్మన్ మాధవి రమేష్, వైస్ చైర్మన్ మధుసూదన్ గౌడ్, మార్కెట్ యార్డ్ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ లు ఈ అంబలి కేంద్రాన్ని ప్రారంభించారు.

మండుతున్న వేసవిని దృష్టిలో ఉంచుకొని వివిధ పనుల నిమిత్తం వనపర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి వచ్చే వారి దాహార్తిని తీర్చేందుకు వనపర్తి శాసనసభ్యులు గౌరవ శ్రీ తూడి మేఘారెడ్డి ఈ అంబలి కేంద్రం చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు.

ఇట్టి అంబలి కేంద్రాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. కార్యక్రమంలో వనపర్తి కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు పసుపుల తిరుపతయ్య, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు వాకిటి ఆదిత్య, మాజీ కౌన్సిలర్లు బ్రహ్మం చారి, కదిలే రాములు, క్యాంపు కార్యాలయం సిబ్బంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు