10 April, 2026 | 2:11 AM

ప్రణాళికాబద్ధంగా చదివితే విజయం తథ్యం

10-04-2026 12:30 AM

ప్రియదర్శిని డిగ్రీ కళాశాల సిల్వర్ జూబ్లీ వేడుకలు విజయవంతం

కొత్తగూడెం, ఏప్రిల్ 9 (విజయక్రాంతి): విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించి ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగితే విజయాలు తలపులు తడతాయని కళాశాల చైర్మన్ కాటేపల్లి నవీన్ బాబు అన్నారు. గురువారం స్థానిక ప్రియదర్శిని డిగ్రీ కళాశాల విద్యా సేవలో 25  సంవత్సరాలను, విజయవంతంగా పూర్తి చేసుకుని , కొత్తగూడెం క్లబ్ లో ఘనంగా సిల్వర్  జూబ్లేని నిర్వహించారు. ఈ  కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై విద్యారంగంలో చేసిన సేవలను గుర్తు చేశారు..

కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ నయీమ్ పాషా మాట్లాడుతూ, కళాశాల విద్యార్థులు యూనివర్సిటీ స్థాయిలో ప్రతి విద్యా సంవత్సరంలో గోల్ మెడల్స్ సాధించడమే కాకుండా క్రీడల్లో నైపుణ్యాన్ని కనబరుస్తున్నారు . డైరెక్టర్ శ్రీరాముని చలపతిరావు  మాట్లాడుతూ, విలువలతో కూడిన విద్యను అభ్యసించి మారుతున్న సమాజానికి అనుగుణంగా జీవించాలని కోరారు. ఈ వేడుకలలో ఆకర్షణీయంగా ఈటీవీ పాడుతా తీయగా ఫేమ్ లక్ష్మీ శ్రావణి శ్రీనివాస్ పాల్గొని , కార్యక్రమం ఆద్యంతం తమ పాటలతో విద్యార్థులు ఉత్సాహపరుస్తూ వేడుకలకు మరింత శోభన తెచ్చారు.

ప్రసంగాల అనంతరం కళాశాల విద్యార్థిని విద్యార్థులు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు విద్యార్థులను ఉత్సాహ పరిచాయి .ఈ కార్యక్రమంలో కళాశాల అకాడమిక్ టాపర్స్ కి ముఖ్య అతిథులు చేతులు మీదుగా  జ్ఞాపికలను అందజేశారు .ఈ కార్యక్రమంలోమరో అతిథి మండవ సుబ్బారావు , వైస్ ప్రిన్సిపాల్ రాయల వివేక్ పిడి కాసి మల్ల రమేష్ అధ్యాపకులు, భద్రు రఫీ వేణు శ్రీనివాస్ ,మాధురి, భారతి ,జ్యోతి ,ప్రగతి ,జహేద షర్మిల తదితరులు పాల్గొన్నారు.