15 June, 2026 | 4:31 PM

శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి సేవా కమిటీ ఆధ్వర్యంలో అమావాస్య అన్నదానం

15-06-2026 03:17 PM

నేరేడుచర్ల,(విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా, నేరేడుచర్ల మండల కేంద్రంలో శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి సేవ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం, అమావాస్య అన్నవితరణ కార్యక్రమం  ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా సేవా కమిటీ సభ్యులు మాట్లాడుతు, దాతలు సహకారంతో సుమారుగా 600 మందికి అన్న వితరణ చేశామని, కమిటీ తరుపున దాతల అందరికీ ప్రత్యేక ధన్యవాదములు తెలియచేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ వాసవి కన్యాకాపరమేశ్వరి కమిటీ సభ్యులు పాల్గొన్నారు.