14 August, 2026 | 4:43 AM

అధికారుల నిర్లక్ష్యమా.. మిల్లర్ల తెలివితేటలా!

14-08-2026 12:00 AM

బియ్యం ఇవ్వకుంటే డబ్బులు ఇస్తే సరిపోతుందా? ఎన్ఫోర్స్‌మెంట్ అధికారులు ఏం చేస్తున్నట్టు

బస్తా బియ్యం లేకుండా ఉన్నప్పుడు సీజ్ చేస్తారా?

అంతర్లీన ఒప్పందమా.. ఆకస్మిక తనిఖీ చేశారా!

గాదిర్యాల శ్రీరామ రైస్ మిల్ సీజ్‌పై ఆరోపణలు 

వివరాలు జేబులో పెట్టుకోము కదా : ఆదిత్య, ఎన్ఫోర్స్‌మెంట్  డీటీ, మహమ్మాదాబాద్ 

మహమ్మదాబాద్ ఆగస్టు 13: రైస్ మిల్లులపై అపార నమ్మకం ఉంచి ప్రభుత్వం రైతుల నుంచి వరి ధాన్యం కొనుగోలు చేసి మిల్లింగ్ చేసి బివ్వం బియ్యం ఇవ్వండి మహాప్రబో అంటూ అప్పగిస్తుంది. ఇందుకు కొంతమంది రైస్ మిల్లర్లు అప్పుడు ఇప్పుడు అంటూ కొంత ఆలస్యమైనా కొంతకొంతగా వరి ధాన్యాన్ని మిల్లింగ్ చేసి తిరిగి ప్రభుత్వానికి అప్పజెప్తారు.

ఇది నిరంతరం జరగవలసిన ప్రక్రియగా చేస్తుండ్రు. ఇక్కడ వరకు బాగానే ఉన్నా  మహమ్మదాబాద్ మండల పరిధిలోని గాదిర్యాల గ్రామం సమీపంలో గల శ్రీరామ రైస్ మిల్ పై వేసిన జరిమానా జనాన్ని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. రైతుల నుంచి సేకరించి 2880 టన్నుల వరి ధాన్యాన్ని మిల్లింగ్ చేసి ఇవ్వవలసి ఉండగా ఇవ్వకపోయినందుకు గాను దాదాపు గా ఏకంగా రూ 10 కోట్ల 80 లక్షల జరిమానా విధించినట్లు సంబంధిత అధికారులు చెబుతున్నారు.

ఈ చర్య పై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిబంధనలు పాటించని రైస్ మిల్లులపై సీఎం రేవంత్ రెడ్డి చర్యలు తీసుకోవాలని ఇటీవల ప్రత్యేక సమావేశంలో చెప్పిండ్రు. అయినప్పటికీ ప్రక్రియ పై అధికారుల నిర్లక్ష్యమా?  ఇవ్వాల్సిన బియ్యం ఇవ్వకుండా ఇతరులకు అమ్ముకొని పోగుచేసుకొని మన పాలన ప్రభుత్వమమే కదా ఇద్దాం అనుకునేలా  రైస్ మిల్లర్ల తెలివితేటల అంటూ ప్రజలు ప్రత్యేకంగా చర్చించుకుంటుండ్రు. 

మిల్లులో బస్తా లేనంతవరకు ఏం చేసిండ్రు..

 రైస్ మిల్లుకు పారిధాన్యాన్ని కొనుగోలు చేసి మిల్లింగ్ చేసి ఇవ్వాలని జిల్లా కలెక్టర్ తో పాటు ఉన్నత అధికారులు సైతం ఎల్లప్పుడూ రివ్యూ నిర్వహిస్తూ సంబంధిత అధికార యంత్రంగానికి దిశా నిర్దేశం చేస్తుంటారు. గాదిరాళ్ల దగ్గర ఉన్న శ్రీరామ రైస్ మిల్లు కూడా 2880 టన్నుల వరి ధాన్యాన్ని అందించి వెనువెంటనే మిల్లింగ్ చేసి ఇవ్వాలని చెప్పినప్పటికీ బస్తా వడ్ల సంచి కూడా లేనప్పుడు మిల్లును తనిఖీ చేసి మాకు ఇవ్వవలసిన బియ్యం ఇవ్వలేదని, ఆ వరి ధాన్యానికి సంబంధించిన విలువ రూ 10 కోట్ల 80 లక్షల అంటూ జరిమానా?విధించడం సీజ్ చేయడం?వెనక ఉన్న అంతరిమేమిటో అంతుచిక్కని ప్రశ్నగా ఉందని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. 

జరిమానా అంటే తప్పు చేసిన దానికి కదా?

 వరి ధాన్యాన్ని ఇచ్చి దానిని లెక్కపెట్టి ఆ విలువ కట్టందని అధికారులు సంబంధిత రైస్ చేసి నోటీసులు జారీ చేయడం జరిగింది. జరిమానా అంటే చేసిన తప్పుకు ఇవ్వవలసిన దానికంటే అత్యధికంగా రుసుము వసూలు చేస్తే అది జరిమానా అవుతుంది కానీ ఇచ్చిన వడ్లకు తగ్గట్టు లెక్క కట్టి ఆ డబ్బులు మాకు ఇవ్వండి అని నోటీసులు జారీ చేస్తే అది జరిమానా ఎలా అవుతుందని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తుండ్రు. ఉద్దేశపూర్వకంగానే నా అధికారులు రైస్ మిల్లులను తనిఖీలు చేయకుండా ఉండి పూర్తిగా మిల్లు నుంచి ధాన్యం తరలింపు జరిగిన తర్వాత సిజ్ చేస్తున్నాం డబ్బులు కట్టండి అనడం ఎంతవరకు సమంజసం అని అధికారుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

వివరాలు జేబులో పెట్టుకోము కదా... ఆదిత్య ఎన్ఫోర్స్‌మెంట్ అధికారి, మహమ్మదాబాద్,

 సీట్ చేసిన రైస్ మిల్ వివరాలు ఫోన్ ద్వారా మండల ఎన్ఫోర్స్‌మెంట్ అధికారి ఆదిత్యను అడిగేందుకు ప్రయత్నించగా ఆ వివరాలు అన్నీ జేబులో పెట్టుకుని తిరిగం  కదా అంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. బాధ్యత గల అధికారి నిరంతరం పర్యవేక్షణ చేసి ప్రభుత్వానికి రావలసిన బియ్యాన్ని అప్పగించేందుకు చర్యలు తీసుకునేది పోయి అవి మరిచి వివరాలు అడిగిన ఇంత నిర్లక్ష్యంగా సమాధానం చెబితే విధి నిర్వహణ ఏ మేరకు ఉందో ఒక్కసారి అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికైనా ఉన్నత అధికారులు దృష్టి సారించి తనిఖీ లు నిరంతరం ఉంటే బస్తా లేకుండా బియ్యం ఎలా బయటికి వెళ్తాయని, మిల్లుల నుంచి ప్రవేట్ వ్యక్తులకు బియ్యం తరలకుండా చూడవలసిన బాధ్యత అధికారులపై ఎంతైనా ఉందంటూ జనం చెబుతున్న మాట.