04-02-2026 12:00:00 AM
శ్రీ పద్మాయల ఎంటర్‌టైన్‌మెంట్స్, శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘ఎర్రచీర: ది బిగినింగ్’. ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్ మనవరాలు బేబీ సాయి తేజస్విని కీలక పాత్రలో నటించింది. సుమన్‌బాబు స్వీయ దర్శకత్వం వహిస్తూ ముఖ్య పాత్రను పోషించారు. కారుణ్య చౌదరి, శ్రీరామ్, కమల్ కామరాజు, అజయ్, అయ్యప్ప పీ శర్మ, సుమన్ శెట్టి, జీవా, సత్యకృష్ణ, అన్నపూర్ణ, సురేశ్ కొండేటి, రఘుబాబు ఇతర పాత్రల్లో కనిపిస్తారు.
ఈ చిత్రం ఫిబ్రవరి 6న విడుదల కానున్న సందర్భంగా దర్శకుడు సుమన్‌బాబు మీడియాతో సినిమా విశేషాలను పంచుకున్నారు. “చింతల్ ప్రాంతంలో నా స్నేహితుడి ఇంటి పక్కన జరిగిన ఒక యధార్థ సంఘటన ఆధారంగా ఈ కథను తీసుకున్నా. 20% వాస్తవ కథ ఉంటుంది. కుటుంబమంతా కలిసి చూసేలా రూపొందించాం. బీ, సీ సెంటర్ థియేటర్లలో ప్రతి షోకీ లక్కీ డ్రా తీసి 10 మందికి చీరలను బహుమతిగా ఇవ్వబోతున్నాం. అక్షయ్‌కుమార్ సినిమా ‘భూత్ బంగ్లా’లో పాప పాలు తాగే షాట్‌ను మా సినిమా ట్రైలర్ నుంచే కాపీ కొట్టారు. అరకులో జరిగిన గిరిజన యధార్థ గాథతో ‘అంబిక పేరుతో సీక్వెల్ తీస్తా” అని తెలిపారు.