13 August, 2026 | 6:12 PM

అంగన్వాడీలో అక్షరాభ్యాసం

13-08-2026 02:11 PM

మల్లాపూర్, ఆగస్టు 13 (విజయక్రాంతి): మల్లాపూర్ మండలం చిట్టాపూర్ గ్రామంలోని అంగన్వాడీ కేంద్రం ఆధ్వర్యంలో చిన్నారులకు అక్షరాభ్యాసం, అన్నప్రసన్న కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులతో అక్షరాభ్యాసం చేయించి, అన్నప్రసన్న కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సంపతి శంకరమ్మ, ఉపసర్పంచ్ బాల్సని ప్రణయ్ గౌడ్, హెల్త్ సిబ్బంది, అంగన్వాడీ సిబ్బంది, మహిళలు, చిన్నారుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. చిన్నారుల ఆరోగ్యం, విద్యాభివృద్ధికి అంగన్వాడీ కేంద్రాల సేవలు ఎంతో కీలకమని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు.