చెన్నై జట్టులోకి ఆకాశ్ మధ్వాల్
ఆయుశ్ మాత్రేకు రీప్లేస్‌మెంట్
ముంబై, ఏప్రిల్ 23: ఐపీఎల్ 19వ సీజన్‌లో కీలక ఆటగాళ్ల గాయాలతో సతమతమ వుతున్న చెన్నై సూపర్ కింగ్స్ రీప్లేస్‌మెంట్స్ పై ఫోకస్ పెట్టింది. గాయం కారణంగా ఆయుశ్ మాత్రే సీజన్ మొత్తానికీ దూరమవడంతో అతని స్థానంలో పేస్ బౌలర్‌ను తీసు కుంది. సీనియర్ పేసర్ ఆకాశ్ మధ్వాల్‌తో మాత్రే స్థానాన్ని భర్తీ చేసింది. సోషల్ మీడి యా వేదికగా ఈ విషయాన్ని ప్రకటించింది.
రూ.30 లక్షల బేస్‌ప్రైస్‌తో మధ్వాల్‌ను జట్టులోకి తీసుకుంటున్నట్టు తెలిపింది. మధ్వాల్ కు ఐపీఎల్‌లో ఆడిన అనుభవం ఉంది. గ తంలో అతడు ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లకు ప్రాతినిథ్యం వహిం చాడు. డెత్ ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్ చేయడం, యార్కర్లు వేయడం అతని ప్రత్యేకత. ఈ కారణంగానే మధ్వాల్‌ను సీఎస్కే ఎంపిక చేసుకుంది. ఇప్పటివరకు 17 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన మధ్వాల్ 23 వికెట్లు పడగొట్టాడు. 32 ఏళ్ల మధ్వాల్‌కు దేశవాళీ క్రికెట్లో ఆడిన అనుభవం కూడా ఉంది. ఐపీఎల్‌లో బెస్ట్ బౌలింగ్ ప్రదర్శన అతనిదే.






