13 August, 2026 | 3:42 AM

విద్యారంగ సమస్యలపై ఏఐఎస్‌ఎఫ్ పోరాటం

13-08-2026 01:22 AM

వనపర్తి టౌన్, ఆగస్టు 12 (విజయక్రాంతి): విద్యార్థుల సమస్యల పరిష్కారానికి ఏఐఎస్‌ఎఫ్ అలుపెరుగని పోరాటం చేస్తుందని జిల్లా ఇన్చార్జ్ రమేష్ అన్నారు. బుధవారం సీపీఐ కార్యాలయంలో ఏఐఎస్‌ఎఫ్ 91వ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యారంగానికి కేంద్రం 10 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 30 శాతం నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏఐఎస్‌ఎఫ్ నాయకులు పాల్గొన్నారు.