17 April, 2026 | 2:35 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

రాజకీయాల్లో చురుకుదనం అవసరం: పసుమర్తి

14-04-2026 12:35 AM

కల్లూరు,ఏప్రిల్ 13(విజయ క్రాంతి): హైదరాబాద్ నగరంలోని కర్మాన్ఘాట్లోని లక్ష్మీ కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అత్యవసర సమావేశంలో ఖమ్మం జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు,కల్లూరు నివాసి పసుమర్తి చందర్ రావు పాల్గొని ప్రసంగించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్యవైశ్యులు రాజకీయంగా ముందుకు వచ్చి ప్రజా వ్యవహారాల్లో చురుకైన పాత్ర వహించాలని పిలుపునిచ్చారు.

సమాజ అభివృద్ధి కోసం రాజకీయాల్లో ప్రాతినిధ్యం అత్యవసరమని ఆయన పేర్కొన్నారు.అలాగే, ఆర్థికంగా బలహీన వర్గాలకు చెందిన ఆర్యవైశ్య విద్యార్థులు విద్య, ఆరోగ్య రంగాల్లో ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు మహాసభ అండగా నిలవాలని ఆకాంక్షించారు.గత రెండు సంవత్సరాల కాలంలో చేపట్టిన సేవా కార్యక్రమాలను కూడా ఈ సందర్భంగా వివరించారు.ఈ సమావేశంలో రాష్ట్రంలోని పలువురు ప్రముఖ ఆర్యవైశ్యులు పాల్గొని సమాజ అభివృద్ధి దిశగా పలు అంశాలపై చర్చించారు.