calender_icon.png 11 February, 2026 | 5:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెద్దమల్లారెడ్డి గ్రామ చెరువును పరిశీలించిన ఏఈ ఆనంద్

11-02-2026 03:38:52 PM

భిక్కనూర్,(విజయక్రాంతి): భిక్కనూర్ మండలం పెద్దమల్లారెడ్డి గ్రామంలోని చెరువు నీటిని, తూమును  ఏఈ ఆనంద్ బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ కోడూరి సాయగౌడ్ ఆయనతో పాటు ఉన్నారు. చెరువులో నీటి నిల్వ స్థాయి, తూము పరిస్థితిని ఏఈ అడిగి తెలుసుకున్నారు. వ్యవసాయ అవసరాల కోసం చెరువునుంచి విడుదల చేసిన నీరు రైతుల పొలాలకు సక్రమంగా చేరుతోందా అనే అంశాన్ని కూడా పరిశీలించారు. సాగునీటికి ఇబ్బందులు లేకుండా తూము, కాలువల సంరక్షణ చేపట్టాలని సూచించారు.