calender_icon.png 11 February, 2026 | 5:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోలింగ్ కేంద్రం వద్ద కత్తి కలకలం...

11-02-2026 03:41:06 PM

* ఓటు వేయడానికి వచ్చిన మహిళ వద్ద కత్తి స్వాధీనం

ఆదిలాబాద్,(విజయక్రాంతి): ఆదిలాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో ఓ మహిళ కత్తితో ఓటువేయడానికి రావడం కలకలం రేపింది. 11వ వార్డు పరిధిలోని రాంనగర్ పోలింగ్ బూత్ కు ఓటు వేయడానికి భర్త తో కలిసి వచ్చిన పర్వీన్ అనే మహిళ ను అక్కడున్న మహిళా పోలీసులు తనిఖీ చేశారు. దీంతో ఆమె వద్ద కత్తి (బటన్ చాక్)ని గుర్తించిన పోలీసులు ఒక్కసారిగా విస్తుపోయారు. వెంటనే కత్తిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆమెను మావల పోలీస్ స్టేషన్ కు తరలించారు.