గురవాయిగూడెంలో స్మార్ట్ కార్డులు పంపిణి
29-08-2026 02:03 PM
కూసుమంచి, (విజయక్రాంతి): మండలంలోని గురవాయిగూడెం గ్రామ పంచాయతీ నందు సర్పంచ్ బానోత్ బిక్షం నాయక్ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం అందించిన స్మార్ట్ రేషన్ కార్డులను శనివారం పంపిణి చేశారు. కావున గ్రామ ప్రజలందరూ తమక రేషన్ కార్డు తీసుకోవాల్సిందిగా కోరారు, ఈ కార్యక్రమంలో జీపీవో బానోత్ వసరం, గ్రామ పంచాయతీ కార్యదర్శి ఫలిత్య కుశ, రేషన్ డీలర్ బానోత్ బుజ్జి, వార్డు సభ్యులు రమాదేవి, దుర్గారావు, పద్మ, సతీష్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు.






