ఘనంగా ఆదివాసీ దినోత్సవ వేడుకలు
09-08-2026 03:02 PM
- పాల్గొన్న కలెక్టర్, ఎస్ పీ
ఆదిలాబాద్, (విజయక్రాంతి): ప్రపంచ ఆదివాసి దినోత్సవం సందర్భంగా ఆదివారం జిల్లా కేంద్రంలోని బస్టాండ్ సమీపంలో నిర్వహించిన వేడుకల్లో జిల్లా కలెక్టర్ రాజర్షిషా, ఎస్పీ అఖిల్ మహాజన్ ముఖ్య అతిథులుగా హాజరై కొమురం భీం, రాంజీ గోండు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆదివాసి జెండాను ఆవిష్కరించి గిరిజన సంస్కృతి సంప్రదాయాల ప్రకారం పూజలు చేశారు. అనంతరం ఆదివాసులతో కలిసి ఉత్సాహంగా కలెక్టర్, ఎస్పీ నృత్యాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఇతర అధికారులు, గిరిజన నాయకులు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.






