బీజేపీ జిల్లా అధ్యక్షుడికి సన్మానం
ముకరంపుర, ఆగస్టు 9(విజయక్రాంతి): కరీంనగర్ పట్టణం రామ్‌నగర్ మార్క్‌ఫెడ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం భారతీయ జనతా పార్టీ కరీంనగర్ జిల్లా శాఖ నూతన అధ్యక్షులుగా నియమితులైన సాయిని మల్లేశంను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సంఘం ప్రముఖులు సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. రామ్‌నగర్ మార్క్‌ఫెడ్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రమోద్ రావు, ప్రధాన కార్యదర్శి గిరి నరేందర్, అధిరెడ్డి వెంకటేశం, రవీందర్ , అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ సాంప్రదాయానికి ప్రతీక బోనాలు
తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయానికి ప్రతీకగా బోనాలు నిలుస్తాయని బిజెపి జిల్లా అధ్యక్షుడు సాయిని మల్లేశం అన్నారు. ఆదివారం కరీంనగర్ పట్టణం కొత్త యస్వాడ లో జరిగిన బోనాల వేడుకల్లో జిల్లా అధ్యక్షులు సాయిని మల్లేశం పాల్గొన్నారు. అమ్మవారి దయతో ప్రజలందరూ సుభిక్షంగా, సుఖ సంతోషాలతో ఉండాలని సాయిని మల్లేశం ఆకాంక్షించారు. ఈ సందర్భంగా కొత్త యస్వాడ స్థానికులు నూతన జిల్లా అధ్యక్షులుగా నియమితులైన సాయిని మల్లేశం ను సన్మానించారు.






