9 August, 2026 | 5:31 PM

ఘనంగా గంగాదేవి బోనాల జాతర

09-08-2026 04:01 PM

మంచిర్యాల టౌన్ , (విజయక్రాంతి): మంచిర్యాలలో గంగాదేవి బోనాల జాతర వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఐబీ చౌరస్తా వద్ద ప్రారంభమైన గంగా దేవి బోనాల జాతర ఉత్సవాల్లో మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖలు పాల్గొని మాట్లాడారు. గంగా దేవి అమ్మవారి ఆశీస్సులతో మంచిర్యాల నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, పాడిపంటలతో, సిరిసంపదలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ఉపాధ్యక్షులు చిట్ల సత్యనారాయణ, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ సల్ల రమ్య-మహేష్, కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కార్పొరేటర్ తూముల నరేష్, మంచిర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ రామగిరి బానేష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పూదరి తిరుపతి, కార్పొరేటర్లు, కో ఆప్షన్స్ సభ్యులు , నాయకులు, మహిళా నాయకురాలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.