9 August, 2026 | 5:06 PM

మంథనిలో ఘనంగా యువజన కాంగ్రెస్ ఆవిర్భావ వేడుకలు

09-08-2026 03:40 PM

శ్రీధర్‌బాబు, శ్రీనుబాబు నాయకత్వంలో యువతకు పెద్దపీట

యూత్ మండల అధ్యక్షుడు సాధుల శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఘనంగా కార్యక్రమాలు

మంథని, ఆగస్టు 9 (విజయక్రాంతి): యువజన కాంగ్రెస్ 66వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను మంథని మండల కేంద్రంలో మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు సాధుల శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు, రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివచరణ్‌రెడ్డి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాలు చేపట్టారు.

సాధుల శ్రీకాంత్ ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎదుట కాంగ్రెస్ జెండా వద్ద యువజన కాంగ్రెస్ జెండాను ఆవిష్కరించారు. అనంతరం అంబేద్కర్ ప్రధాన చౌరస్తాలో కేక్ కట్ చేసి యువజన కాంగ్రెస్ ఆవిర్భావ వేడుకలు నిర్వహించారు. కార్యక్రమం అనంతరం శ్రీకాంత్ ఆధ్వర్యంలో మంథని ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేసి సేవా కార్యక్రమం చేపట్టారు. యువత రాజకీయాలతో పాటు సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ ముందుండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు సాధుల శ్రీకాంత్ యువతను సమన్వయం చేస్తూ పార్టీ కార్యక్రమాలతో పాటు సేవా కార్యక్రమాలను చురుగ్గా నిర్వహిస్తున్నారని అన్నారు. యువతను కాంగ్రెస్ పార్టీకి మరింత చేరువ చేయడంతో పాటు వారికి రాజకీయంగా అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.

యువతకు శ్రీనుబాబు ప్రోత్సాహం

టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు నాయకత్వంలో మంథని నియోజకవర్గంలో యువతకు కాంగ్రెస్ పార్టీలో కీలక బాధ్యతలు, పదవులు లభిస్తున్నాయని నాయకులు తెలిపారు. నేటి యువజన కాంగ్రెస్ నాయకుల్లో పలువురు సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులుగా ఎదగడం ఇందుకు నిదర్శనమన్నారు.

శ్రీధర్‌బాబు చొరవతో మంథని అభివృద్ధి

మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు చొరవతో మంథని నియోజకవర్గానికి భారీగా నిధులు మంజూరవుతున్నాయని నాయకులు తెలిపారు. మంథని పట్టణంలో రహదారుల విస్తరణ, సమీకృత ప్రభుత్వ కార్యాలయ భవనాలు, 50 పడకల ప్రభుత్వ ఆస్పత్రి, నిరుద్యోగ యువత కోసం ఉచిత కోచింగ్ సెంటర్, చెరువుల అభివృద్ధి వంటి అనేక కార్యక్రమాలు కొనసాగుతున్నాయని చెప్పారు.

యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు మంథని నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే మంత్రి శ్రీధర్‌బాబు లక్ష్యమని పేర్కొన్నారు. శ్రీధర్‌బాబు, శ్రీనుబాబు నాయకత్వంలో యువజన కాంగ్రెస్‌ను మరింత బలోపేతం చేస్తామని సాధుల శ్రీకాంత్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మంథని మున్సిపల్ చైర్మన్ వోడ్నాల శ్రీనివాస్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కుడుదుల వెంకన్న, సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు మంథని రాకేష్, మాజీ ఎంపీపీ కొండా శంకర్, మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అజీమ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.