9 August, 2026 | 5:31 PM

ఘనంగా అమ్మవారి బోనాలు

09-08-2026 04:07 PM

నస్పూర్, (విజయక్రాంతి): మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్( Mancherial Municipal Corporation) పరిధిలోని 32వ డివిజన్‌లో శ్రీ ఆదిపరాశక్తి అమ్మవారి బోనాల జాతర ఆది వారం ఘనంగా నిర్వహించారు. ఉత్సవాల్లో భక్తిశ్రద్ధలతో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు పాల్గొని అమ్మవారినీ దర్శించుకున్నారు. మంచిర్యాల ప్రజలందరిపై ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని, ప్రతి కుటుంబం సుఖశాంతులతో, సిరిసంపదలతో ఉండాలని కోరుకున్నారు.

భక్తి, సంప్రదాయం, సంస్కృతికి ప్రతీకగా నిలిచే బోనాల జాతర ఉత్సవాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య మహేష్, టీపీసీసీ ఉపాధ్యక్షులు చిట్ల సత్యనారాయణ, కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కార్పొరేటర్ తూముల నరేష్, మంచిర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ రామగిరి బానేష్,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పూదరి తిరుపతి, పీసీసీ సభ్యులు, నస్పూర్ పట్టణ ఇంఛార్జి నూకల రమేష్, కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా నాయకురాలు, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు..