జైల్ భరో కార్యక్రమాన్ని జయప్రదం చేయండి
సిఐటియు జిల్లా నాయకులు మద్దాల ప్రభాకరరావు.
ఎర్రుపాలెం ఆగస్టు 9 (విజయ క్రాంతి): ఎర్రుపాలెం మండలం బనిగండ్లపాడు గ్రామం నందు గ్రామ పంచాయితీ కార్మికుల సమావేశం సీఐటీయూ కో కన్వీనర్ దూదిగం బసవయ్య అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా నాయకులు మద్దాల ప్రభాకర్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీ సిబ్బందినందరిని పర్మినెంట్ చేయాలి, వేతనాలు పెంచి మల్టీపర్పస్ వర్కర్ విధానం రద్దు చేయాలన్నారు.
క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో మరోసారి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచేందుకు ఆగస్టు 10న విబిజి రాంజీ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని కార్మిక చట్టాలను మార్చి నాలుగు లేబర్ కోడలుగా తీసుకొచ్చిన లేబర్ కోడలు వెంటనే రద్దు చేయాలని విద్యుత్ సవరణ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా బిజెపి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ రైతులు,కార్మికులు,వ్యవసాయ కూలీలు, మహిళలు, విద్యార్థులు, యువతి యువకులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ఆగస్టు 10వ తారీఖున జైలు భరో కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు వారి సందర్భంగా తెలియజేశారు.ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్మికుల మండల అధ్యక్షా కార్యదర్శులు గంతల నాగేశ్వరరావు, రవీంద్ర,ఉపాధ్యక్షులు పెద్దమళ్ళ శ్రీనివాసరావు ఎస్ కే బాజీ రవీంద్ర కృష్ణ నాగేశ్వరరావు ప్రసాదు బాబు ఖాన్ వెంకటరెడ్డి పుల్లమ్మ పాల్గొన్నారు.






