డా.పైడి ఎల్లారెడ్డికి ప్రతిష్టాత్మక జపాన్ పర్యటనకు ఆహ్వానం
తెలంగాణకు దక్కిన అరుదైన గౌరవం!
కామారెడ్డి, ఆగస్టు 9 (విజయక్రాంతి): ప్రముఖ శాస్త్రవేత్త , బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డా.ఎల్లారెడ్డి కి ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ అవకాశం లభించింది. గ్రామీణ మూలాలను మరిచిపోకుండా నిరంతరం సమాజ హితం కోసం, సైన్స్, రాజకీయ రంగాలలో విశేషమైన సేవలందిస్తున్న ఆయన... మరోసారి తెలంగాణ కీర్తి ప్రతిష్టలను జాతీయ, అంత ర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లారు. కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ నేతృత్వంలో ఆగస్ట్ 24 నుంచి 28 వరకు జపాన్ దేశంలో పర్యటించనున్న ప్రతిష్టాత్మక ఇండియన్ బిజినెస్ డెలిగేషన్ (వ్యాపార ప్రతినిధి బృందం)లో ఆయనకు చోటు దక్కడం తెలంగాణ వాసి కి గర్వించదగ్గ విషయం. భారత పరిశ్రమల సమాఖ్య డాక్టర్ ఐ డి ఎల్లారెడ్డి కి అధికారికంగా సమాచారం అందజేశారు.
శాస్త్రీయ దృక్పథం - విశేష ప్రతిభ
ఒకవైపు శాస్త్రవేత్తగా పరిశోధనలు, మరోవైపు ప్రజాక్షే త్రంలో రాజకీయ నాయకుడిగా ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడే డా.పైడి ఎల్లారెడ్డి నేపథ్యం, ఆయన వ్యక్తిత్వం ఎంతో స్ఫూర్తిదాయకం గా నిలిచింది. విజ్ఞాన రంగంలో ఆయన సాధించిన అనుభవం, విషయ పరిజ్ఞానం, దేశాభివృద్ధిపై ఆయన కున్న స్పష్టమైన దృక్పథమే ఈ అంతర్జాతీయ స్థాయి వేదికపై ఆయనకు చోటు కల్పించేలా చేశాయి. ఆయనకున్న విశేషమైన పరిచయాలు, పారిశ్రామిక, సాంకేతిక రంగాలపై ఆయనకంటూ ప్ర త్యేకమైన గుర్తింపు ఉండటంతోప్రభుత్వం ఆయన ప్రతిభను గుర్తించి ఈ పర్యటనలో స్థానం కల్పించింది.
అధికారిక భాగస్వామ్యం - పర్యటన కార్యక్రమాలు..
భారత ప్రభుత్వం, జపాన్లోని భారత రాయబార కార్యాలయం, పలు ప్రముఖ జపాన్ సంస్థల సంయుక్త భాగస్వామ్యంతో ఈ ప్రతిష్టాత్మక పర్యటన , సమావేశాలు జరగనున్నాయి. ఈ పర్యటన లో భాగంగా హైలెవెల్ బిజినెస్ మీటింగ్స్ నిర్వహించ డంతోపాటు, జపాన్లోని పలు అగ్రగామి కంపెనీల ప్రతినిధులతో ప్రత్యేక చర్చలు జరుపుతారు. దేశ ద్వైపాక్షిక సంబంధాలకు పెద్దపీట వేస్తూ వివిధ పరిశ్రమల సంఘాలు, ప్రభుత్వ అధికారుల తో జరిపే సమావేశాల ద్వారా భారత్, జపాన్ దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు మరింత బలపడతాయి. భారత్, జపాన్ దేశాల మధ్య వాణిజ్యం, నూతన పెట్టుబడులు, సాంకేతిక భాగస్వా మ్యాన్ని మరింత బలోపేతం చేయడమే ఈ పర్యటన యొక్క ప్రధాన లక్ష్యమని అధికారులు పేర్కొన్నారు. ఈ అంతర్జాతీయ స్థాయి ప్రతినిధి బృందంలో తెలంగాణ రాష్ట్రం కామారెడ్డి జిల్లా కు చెందిన ప్రముఖ శాస్త్రవేత్త డా. పైడి ఎల్లారెడ్డి కి చోటు దక్కడం పట్ల రాజకీయ, పారిశ్రామిక, శాస్త్ర రంగాలకు చెందిన ప్రముఖుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
తెలంగాణకు గర్వకారణం..!
తెలంగాణ గడ్డపై పుట్టి శాస్త్ర, సాంకేతిక రంగాలలో అగ్రగామిగా ఎదుగుతూ నేడు అంతర్జాతీయ వేదిక పై దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న డా.పైడి ఎల్లారెడ్డి ప్రయాణం ఎంతో మంది యువతకు ఆదర్శ ప్రాయం. ఈ ప్రతిష్టాత్మక జపాన్ పర్యటన విజ యవంతం కావాలని, తద్వారా రాష్ట్ర, దేశ ఖ్యాతి మరింత ఇనుమడించాలని జిల్లా ప్రజలు కోరుకుంటున్నారు.






