ఆర్‌సీబీపై ఆదిత్య బిర్లా గ్రూప్ కన్ను
23-03-2026 01:01 AM
బెంగళూరు, మార్చి 22 : ఐపీఎల్‌లో అత్యంత పాపులర్ ఫ్రాంచైజీ రాయల్ ఛా లెంజర్స్ బెంగశూరు అమ్మకం ప్రక్రియ చివ రి దశకు చేరింది. ప్రస్తుతం బిడ్డింగ్ రేసులో రంజన్ పాయ్ కన్సార్టియం, స్వీడన్‌కు చెంది న ఈక్యూటీ సంస్థ నిలిచాయి. అయితే గడు వు దగ్గర పడుతున్న వేళ మరో కంపెనీ రేసులోకి వచ్చింది.
భారత్‌కు చెందిన ఆదిత్య బిర్లా గ్రూపు కూడా పోటీలో నిలిచింది.అమెరికా క్రీడా పెట్టుబడిదారుడు డేవిడ్ బ్లిట్జర్‌తో కలిసి ఐపీఎల్, మహిళల ఐపీఎల్ ఫ్రాంచైజీ ల కోసం బిడ్ దాఖలు చేసేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం మూడు కంపెనీల మధ్య పోటీ నెలకొనడంతో బిడ్ విలువ 2 మిలియన్ డాలర్లు దాటిపోవడం ఖాయమని అంచనా వేస్తున్నారు.




