11 June, 2026 | 3:28 PM

పాఠశాలలో, గ్రామాల్లో బ్లీచింగ్ క్లోరినేషన్ సరిగా చేయాలి

11-06-2026 02:22 PM

ఖానాపూర్ ఎం పి ఓ సిహెచ్ రత్నాకర్ రావు

ఖానాపూర్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని అన్ని గ్రామాల్లో సిబ్బంది బ్లీచింగ్, క్లోరినేషన్ పాఠశాలల్లో పరిశుభ్రత నిర్వహించాలని ఖానాపూర్ ఎంపీఓ సి హెచ్ రత్నాకర్ రావు సిబ్బందికి ఆదేశించారు .ఈ మేరకు గురువారం మండలంలోని కొలాం గూడా, బీర్ నంది, రంగపేట, గ్రామపంచాయతీలో ఆయన పాఠశాలలు పరిశుభ్రత, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం, నర్సరీల పరిశీలన చేశారు. ఈ మేరకు గ్రామపంచాయతీ రికార్డులను పరిశీలించారు. రానున్న రెండు రోజుల్లో పాఠశాలలు పరిసరాలు చెత్తాచెదారం లేకుండా సిబ్బంది శుభ్రం చేయాలని ఆదేశించారు. దాంతోపాటు వర్షాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో బావుల్లో క్లోరినేషన్ , మురికి కాలువల పరిశుభ్రం చేయాలని ఆయన ఆదేశించారు. ఆయనతోపాటు పంచాయతీ కార్యదర్శులు దేవేందర్ రెడ్డి, మహేష్, తదితరులు ఉన్నారు.