సన్ రైజ్ అయ్యేనా?
బ్యాటింగ్‌లో హిట్.. బౌలింగ్‌లో ఫట్
గత సీజన్‌లో లీగ్‌స్టేజ్‌కే పరిమితం
మళ్లీ బలహీనంగానే బౌలింగ్
ఇషాన్ కెప్టెన్సీపైనే ఆశలు
ఐపీఎల్‌లో ఆ జట్టు పేరు చెబితే ప్రత్యర్థి బౌలర్లకు హడలే. పవర్ ప్లేలో రికార్డు స్కోర్లు... మ్యాచ్‌లలో అలవోకగా 250 ప్లస్ స్కోర్లు.. 300 కూడా లోడింగ్ అన్న అంచనాలు.. ఆ జట్టు మరేదో కాదు సన్‌రైజర్స్ హైదరాబాద్.. విధ్వంసకర బ్యాటర్లున్న సన్‌రైజర్స్ గత ఆరేళ్లలో ఒకసారి మాత్రమే ఫైనల్ చేరింది. గత సీజన్‌లో లీగ్ స్టేజ్‌కే పరిమితమైన సన్‌రైజర్స్ బౌలింగే బలహీనత.. మరి ఈ సీజన్‌లోనూ గాయాలు వెంటాడుతున్న వేళ కొత్త కెప్టెన్ ఇషాన్ కిషన్ సారథ్యంలో సన్‌రైజ్ అవుతుందా ?
హైదరాబాద్, మార్చి 21: ఐపీఎల్ వస్తుందంటే టైటిల్ ఫేవరెట్స్ జాబితాలో సన్‌రైజర్స్ హైదరాబాద్ పేరు కూడా ఉంటుంది. ఎందుకంటే జట్టులో స్టార్ ప్లేయర్స్ అది కూడా విధ్వంసకర బ్యాటర్లు ఉండడమే దీనికి కారణం. గత కొన్ని సీజన్లుగా సన్‌రైజర్స్ బ్యాటింగ్ సత్తా ఏంటనేది అభిమానులు దగ్గరగా చూశారు. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషా న్ కిషన్, నితీశ్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసె న్.. ఇలాంటి టీ20 హిట్టర్స్ అందరూ ఈ జట్టులోనే ఉన్నారు.
అందుకే గత సీజన్లలో సన్‌రైజర్స్ రికార్డు స్థాయిలో స్కోర్లు నమో దు చేసింది.సీజన్‌లో అత్యధికంగా 250 ప్లస్ స్కోర్లు చేసిన జట్టుగా రికార్డులకెక్కింది. కానీ క్రికెట్‌లో కేవలం బ్యాటింగ్ తోనే విజయా లు రావు. బౌలింగ్ కూ డా బాగుంటేనే మ్యాచ్ లు గెలుస్తారు. బ్యాటింగ్‌లో సూపర్ హిట్‌గా కనిపించిన సన్ రైజర్స్ బౌలింగ్‌లో మాత్రం బలహీనంగా మారింది. ఈ కార ణంగానే గత సీజన్‌లో లీగ్ స్టేజ్‌కే పరిమితమైంది. ఈ సారి కూడా బౌలింగ్ వీక్‌నెస్ వెంటాడుతోంది. పలువురు బౌలర్లు గాయాలతో దూరమవడం కూడా ఇబ్బందిగా మారింది.
కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ గా యం నుంచి కోలుకోకపోవడంతో సగం మ్యాచ్‌లకు దూరం కానున్నాడు. దీంతో కమ్మిన్స్ స్థానంలో ఇషాన్ కిషన్‌కు కెప్టెన్సీ అప్పగించిన సన్ రైజర్స్ యాజమాన్యం అభిషేక్ శర్మను అతనికి డిప్యూటీగా నియమించింది. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో జార్ఖండ్ ను ఛాంపియన్‌గా నిలిపిన ఇషాన్ కిషన్‌పై భారీ అంచనాలే ఉన్నాయి. మరి కెప్టెన్సీ ఒత్తిడి తట్టుకుని ఆరెంజ్ ఆర్మీని ఈ యువ ఆటగాడు ఎలా నడిపిస్తాడో చూడాలి. నిజానికి మినీ వేలంలో సన్ రైజర్స్ వ్యూహాత్మకంగా వ్యవహరించలేకపోయింది.
రూ.25.5 కోట్ల భారీ పర్స్ తో వేలానికి వెళ్లిన కావ్యా మారన్ సరైన ప్లేయర్లను కొనుగో లు చేయడంలో విఫలమైంది. ప్రధాన ఆటగాళ్ళందరినీ రిటైన్ చేసుకున్నప్పటకీ బ్యాకప్ పై సరిగ్గా ఫోకస్ పెట్టలేదు. జట్టు బలహీనతలపైనా దృష్టి సారించలేదు. బౌలింగ్‌లో మ హ్మద్ షమీని భర్తీ చేయలేకపోయింది. చాలా మొత్తం చేతిలో ఉన్నా స్పెషలిస్ట్ స్పిన్నర్‌ను తీసుకోలేకపోయింది. రవి బిష్ణోయ్ కోసం తీవ్రంగా ప్రయత్నించి చివర్లో వదిలేసింది. అనామక ఆల్ రౌండర్ల కోసం గట్టిగా నే పోరాడినా వారిని దక్కించుకోలేకపోయింది.
ఆశ్చర్యకరంగా ఆర్సీబీ వదిలేసి, అన్ సోల్‌గా మిగిలిన లివింగ్‌స్టోన్ కోసం ఏకంగా 13 కోట్లు వెచ్చించింది. జాక్ ఎడ్వరడ్స్‌ను 3 కోట్లకు తీసుకోగా అతను గాయంతో దూరమయ్యాడు. మొత్తం మీద గత సీజన్‌లో ఉన్న బౌలింగ్ బలహీనతే ఇప్పుడు కూడా సన్ రైజర్స్‌కు సమస్యగా మారింది. అ యితే భారీస్కోర్లను కాపాడుకోవాలంటే మంచి బౌలింగ్ కూడా ఉండాల్సిందే. స్పెషలిస్ట్ భా రత పేసర్, స్పిన్నర్ లేకపోవడం లో టుగానే కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో విధ్వంసకర బ్యాటింగ్‌తో ఎంతవరకూ సక్సెస్ అవుతుం దో చూడాలి.
సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు
ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, అనికేత్ వర్మ, ఆర్ సమరన్, ఇషాన్ కిషన్, హెన్రీచ్ క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి, హర్ష్ దూబే, కామిందు మెండీస్, హర్షల్ పటేల్, బ్రైడన్ కార్స్, ప్యాట్ కమిన్స్, జయదేవ్ ఉనాద్కత్, ఇషాన్ మలింగా, జీషన్ అన్సారీ ,సలీల్ అ రోరా, శివాంగ్ కుమార్, క్రెయిన్స్ ఫులెట్రా, సాకిబ్ హుస్సేన్, ఓంకార్ తర్మలె, ప్రఫుల్ హింగే, అమిత్ కుమార్, లియామ్ లివింగ్ స్టోన్, శివమ్ మావి, జాక్ ఎడ్వరడ్స్




