పౌరులను కాపాడాల్సిన సైబర్ సెక్యూరిటీకే రక్షణ లేదు
హైదరాబాద్: బీఆర్ఎస్ నాయకులు నిమ్స్ ఆసుపత్రిలో(NIMS Hospital) చికిత్స పొందుతున్న ఖమ్మం నగరానికి చెందిన బాలికను పరామర్శించారు. భవనం పైనుంచి తోయడంతో తీవ్రంగా గాయపడిన బాలిక నిమ్స్ లో చికిత్స పొందుతోంది. ఖమ్మం అమానుష ఘటనలో గాయపడిన బాధితురాలిని నిమ్స్ ఆస్పత్రిలో హరీశ్ రావు, సునీతా లక్ష్మారెడ్డి పరామర్శించారు. ఖమ్మంలో హృదయవిదారక ఘటన జరిగిందని మాజీ మంత్రి హరీశ్ రావు(Former Minister Harish Rao) తెలిపారు.
ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. 12 ఏళ్ల బాలికపై అమానుషం జరిగితే ప్రభుత్వ స్పందన సరిగా లేదని హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలిక కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. పౌరులను కాపాడాల్సిన సైబర్ సెక్యూరిటీకే రక్షణ లేదని హరీశ్ రావు పేర్కొన్నారు. తెలంగాణలో సైబర్ సెక్యూరిటీ వింగ్ వాళ్ల ఎక్స్ అకౌంట్, వాళ్ల వెబ్సైట్ హ్యాక్ అయ్యిందన్నారు.






