మొయినాబాద్ హంతకురాలు మృతి
యాసిడ్ తాగి పోలీస్ స్టేషన్లో ఆత్మహత్యాయత్నం.
తాండూరు, జూన్ 11, (విజయక్రాంతి): రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ ఫామ్ హౌస్(Moinabad farmhouse case) లో మహిళల జంట హత్యల కేసులో ప్రధాన నిందితురాలైన కరీమా బేగం గురువారం మృతి చెందింది. రూరల్ సీఐ ప్రవీణ్ కుమార్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం బషీరాబాద్ మండలం ఖాసీంపూర్ గ్రామానికి చెందిన అంగన్వాడి ఆయా జుబేదా బేగం వద్ద అప్పు తీసుకుంది, ఇందిరా నగర్ కు చెందిన మరో మహిళ పెద్ద సైతం కరిమా బేగం గతంలో అప్పు తీసుకుంది. మొయినాబాద్ ఫామ్ హౌస్ కు వస్తే తీసుకున్న అప్పు తీరుస్తానని ఇద్దరు మహిళలను వేరువేరుగా పిలిపించుకొని కరీమా బేగం, భర్త రెహమాన్, ఫామ్ హౌస్ సెక్యూరిటీ గార్డ్ నయీమ్ తో కలిసి వారిని హత్య చేసి అక్కడే పూడ్చి పెట్టింది.
ఈ కేసులో అరెస్ట్ అయినా కరీమా బేగం ను గౌత పూర్ పోలీస్ స్టేషన్ విచారణ కోసం తీసుకురాగా బాత్రూంలోకి వెళ్లిన కరీమా బేగం అక్కడున్న యాసిడ్ తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. వెంటనే అక్కడున్న పోలీస్ సిబ్బంది ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ నగరంలోని నిమ్స్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఆయన తెలిపారు. విచారణ సమయంలో ఇద్దరు పోలీస్ కానిస్టేబుల్ నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న ఆరోపణలపై ఎస్పీ ఇరువురిని సస్పెండ్ చేస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేశారు. అప్పిచ్చిన పాపానికి ప్రాణాలు తీసిన హంతకురాలి పాపం పండిందని, కర్మఫలం అంటే ఇదేనని స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.






