31 August, 2026 | 7:34 PM

దసరా నాటికి దేవాదుల సాగునీరు అందించేందుకు కృషి

31-08-2026 07:00 PM

- ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి

తరిగొప్పుల,(విజయక్రాంతి): మండలంలోని బొంతగట్టు నాగారం, బోత్తలపర్రె, జాలు భాయ్ తండా, బోజ్య తండా, కొత్త తండా వీఓ భవనల, భవన నిర్మాణ పనులకు ఎమ్మెల్యే డా. పల్లా రాజేశ్వర్ రెడ్డి(MLA Palla Rajeshwar Reddy) శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సెప్టెంబర్ చివరి నాటికి దేవాదుల మోటార్ల ఏర్పాటు పూర్తి చేసి, దసరా (అక్టోబర్ 15-20) నాటికి సాగునీరు ఇచ్చేందుకు కృషి చేస్తున్నామని, అందుకు సంబందించిన పైప్‌లైన్ పనులు పూర్తయ్యాయని తలిపారు. ఇందిరమ్మ ఇళ్ల ఎంపికలో రాజకీయాలకు తావులేదని, అర్హత, పేదరికమే ప్రామాణికమన్నారు. లంచం అడిగితే నాకు సమాచారం ఇవ్వాలని, ఒక్క రూపాయి కూడా ఇవ్వొద్దని,  గ్రామానికి అవసరమైన రోడ్లు, ఇతర అభివృద్ధి పనులకు నిధుల కొరత లేకుండా చూస్తా అని అన్నారు.