12 May, 2026 | 8:29 PM

Breaking News

టి దుకాణాలలో స్మోకింగ్ జోన్లను ఎత్తివేయండి   •   గంజాయి కేసులో నలుగురిపై కేసు.. డి-అడిక్షన్ సెంటర్‌కు తరలింపు   •   మంత్రి తుమ్మల పేరున ప్రత్యేక ప్రార్థనలు జరిపిన దమ్మపేట ముస్లిం మైనారిటీ నాయకులు   •   వికె సీఎం ఫిట్ కమిటీ సమావేశం   •   సమ్మర్ క్యాంప్ ఆకస్మిక తనిఖీ   •   పదో తరగతి సప్లమెంటరీ విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ తరగతులు ప్రారంభం   •   ప్రభుత్వ స్థలాల్లో అక్రమ నిర్మాణాలు నిర్మిస్తే సహించం   •   నిర్మాణ రంగంలో ముడి సరుకుల ధరలకు అనుగుణంగా నూతన ధరలు చెల్లించండి   •   గరిడేపల్లిలో ఘనంగా హనుమాన్ జయంతి   •   అల్ఫోర్స్ హై స్కూల్ సుల్తానాబాద్ కు సీబీఎస్ఈ గుర్తింపు   •  

రెండో రోజు కొనసాగిన సందడి..

28-11-2025 08:53 PM

సర్పంచి స్థానానికి 25, వార్డు స్థానాలకు 22 నామ పత్రాల దాఖలు 

నామినేషన్ ప్రక్రియను పర్యవేక్షించిన అదనపు కలెక్టర్ నగేష్

పాపన్నపేట,(విజయక్రాంతి): పాపన్నపేట మండలంలో నామినేషన్ల పర్వం రెండో రోజైన శుక్రవారం అట్టహాసంగా కొనసాగింది. మండలంలోని 40 గ్రామ పంచాయతీలకు మండల పరిషత్తు కార్యాలయంలో నామినేషన్లు స్వీకరిస్తున్నారు. అందుకు కార్యాలయంలో 10 కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఉదయం 10 గంటల నుంచి నామపత్రాల స్వీకరణ మొదలు పెడుతున్నారు. మొదటి రోజైన గురువారం సర్పంచ్ స్థానానికి 13 నామినేషన్లు దాఖలు చేశారు.

రెండో రోజు అయిన శుక్రవారం సర్పంచ్ స్థానానికి 25, వార్డు స్థానాలకు 22 మంది నామినేషన్లు దాఖలు చేశారు. సర్పంచి స్థానానికి పాపన్నపేట నుంచి లింగంపేట పావని నరేందర్ గౌడ్ నామినేషన్ దాఖలు చేశారు. అబ్లాపూర్ నుంచి నిరుడి వెంకటేశం, కుర్తివాడ వడ్డేపల్లి గోపాల్, జయపురం మేడిద అనసుజ, నార్సింగ్ నుంచి గాండ్ల నాగరాజు, తదితరులు నామినేషన్లు దాఖలు చేశారు. వార్డు సభ్యుల స్థానాలకు 22 మంది నామినేషన్లు దాఖలు చేశారని ఎంపీడీవో విష్ణువర్ధన్ తెలిపారు. జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ నామినేషన్ ప్రక్రియను పర్యవేక్షించారు