6 June, 2026 | 6:00 PM

Breaking News

వన్యప్రాణులు, పక్షుల సంరక్షణలో ప్రజల భాగస్వామ్యం కీలకం   •   కాంగ్రెస్ పార్టీలో చేరిన రాఘవపల్లి గ్రామ సర్పంచ్, పాలకవర్గం   •   కొమ్ముగూడెం పంచాయతీలో సర్పంచ్ సోయం సత్యవతి అధ్యక్షతన గ్రామ సభ   •   ఆలిండియా పోలీస్ స్పోర్ట్స్ మీట్‌లో బ్రాంజ్ మెడల్ సాధించిన కానిస్టేబుల్ శ్రీలత   •   గ్రామ సమస్యల పరిష్కారానికి ప్రజలు అవగాహన కలిగి ఉండాలి   •   కోల్‌కతా మెట్రోలో ప్రయాణించిన కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌   •   'ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక' ముగింపు కార్యాచరణ   •   అశ్వాపురం ప్రధాన రహదారిపై డివైడర్లు, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయాలి   •   ప్రజల భాగస్వామ్యంతో సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   చర్లలో ఘనంగా ఎంపీ బలరాం నాయక్ జన్మదిన వేడుకలు   •  

అభివృద్ధి పనులను పరిశీలించిన అదనపు కలెక్టర్ చంద్రయ్య

06-06-2026 04:48 PM

బెల్లంపల్లి,(విజయక్రాంతి): బెల్లంపల్లి మండలం కన్నాల గ్రామపంచాయతీ పరిధిలోని అమృత్ 2.O పనులను జిల్లా అదనపు కలెక్టర్ (మున్సిపల్ అడ్మిన్) చంద్రయ్య తో కలిసి పరిశీలించిన బెల్లంపల్లి మున్సిపల్ చైర్ పర్సన్  దావస్వాతి పరిశీలించారు. ఈ సందర్బంగా అమృత్ 2.0 తాగునీటి పథకంకు సంబందించిన పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అధికారులకు పనులను వేగవంతంగా పూర్తి చేసి 4నెలల లోపు ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. ఇప్పటివరకు జరిగిన పనుల పురోగతిపై అడిగి తెలుసుకున్నారు. అనంతరం రైల్వే స్టేషన్ ఏరియాలోని ఫిల్టర్ బెడ్ ను పరిశీలించారు. అధికారులు పనుల పురోగతిని తెలిపారు.

అక్కడి. అక్కడి నుంచి  పట్టణంలోని రైల్వే రడగంబాల బస్తీలో గల పురాతన "జాతికుంట చెరువు ను సందర్శించారు. చెరువు సుందరీకరణ" పనులను జిల్లా అదనపు కలెక్టర్ (మున్సిపల్ అడ్మిన్) చంద్రయ్య, బెల్లంపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ దావ స్వాతి పరిశీలించారు. జాతికుంట చెరువునకు సంబందించిన భూములు ఆక్రమణాలకు, కబ్జాలకు గురికాకుండా చెరువు చుట్టూ కందకం తవ్వి, కట్ట ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఆయన వెంట మున్సిపల్ కమిషనర్ తన్నీరు రమేష్  ఇరిగేషన్ EE, DE అధికారులు, స్థానిక వార్డు మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు కాంపల్లి రాజం ,కాంగ్రెస్ సీనియర్ నాయకులు దావా రమేష్, కంకటి శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.