జూన్ 21న ఉద్యమకారుల ఆత్మగౌరవ సమ్మేళనం
తెలంగాణ ఉద్యమకారుల సంఘం చైర్మన్ డాక్టర్ పిడమర్తి రవి
ముషీరాబాద్, మే12 (విజయక్రాంతి): మలిదశ ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్న తెలంగాణ ఉద్యమకారులను ఏకం చేస్తూ తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవ సమ్మేళనాన్ని జూన్ 21న హైదరాబాద్‌లో నిర్వహిస్తామని తెలంగాణ ఉద్యమకారుల సంఘం వ్యవస్థాపకులు డాక్టర్ పిడమర్తి రవి తెలిపారు. ఈ మేరకు మంగళవారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎండల ప్రదీప్, మూఢ నమ్మకాల జాతీయ అధ్యక్షులు బైరి నరేష్‌తో కలసి ఆయన మాట్లాడారు.
ప్రభుత్వం ఉద్యమకారులను గుర్తించి గుర్తింపు కార్డు, పింఛన్, 250 గజాల ఇంటి స్థలం కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. బైరీ నరేష్ మాట్లాడుతూ ఉద్యమంలో పనిచేసిన సింగరేణి పరివాహక జిల్లాల ఉద్యమ నాయకులను ఐక్యంచేసి ఉద్యమకారుల సమ్మేళనాన్ని వేలాది మందితో విజయవంతం చేస్తానని తెలిపారు.
సమ్మేళనం ప్రచార కమిటీ అధ్యక్షులుగా నిమ్మల వీరన్నను నిర్మించినట్లు తెలిపారు. సంఘం నేతలు బోరెల్లి సురేష్, ఎండి. రహీం, ఎం. మల్లేష్, బి. శ్రీనివాస్ గౌడ్, బి. స్టాలిన్, పి. ఆంజనేయులు, కె. గణేష్, వరలక్ష్మి, చందర్ నాయక్, సంజయ్ గౌడ్, జె. సాయన్న, ఎన్. మహేష్, సీహెచ్. శేఖర్, ఎం. ప్రసాద్, జగదీష్, ఎం. మహేష్ పాల్గొన్నారు.






