13 May, 2026 | 2:24 AM

జీళ్లచెరువులో హనుమాన్ జయంతి

13-05-2026 01:34 AM

కూసుమంచి, మే 12 (విజయక్రాంతి): ఖమ్మం జిల్లా, కూసుమంచి మండలం జీళ్ళచెరువు గ్రామంలోని శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో హనుమాన్ జయంతి సందర్భంగా అర్చకులు చిలకమర్రి స్వామినాథ్ చార్యులు ఆధ్వర్యంలో మంగళవారం వేడుకలను భక్తులు ఘనంగా జరుపుకున్నారు.

తెల్లవారుజామున స్వామివారికి అభిషేకాలు, ఆకు పూజ చేశారు. స్థానిక భక్త భజన మండలి ఆధ్వర్యంలో హనుమాన్ చాలీసా పారాయణము జరిగింది. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజలు చేశారు. తీర్థప్రసాదాలు స్వీకరించారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఐతగాని వెంకటరమణ నాగేశ్వరరావు, వార్డు సభ్యుడు పెండ్ర అంజయ్య, భక్తులు చెన్నా వెంకన్న, విజయ్, అంబాల సైదులు, మల్లెల రవికుమార్, బూర్లే రవికుమార్,  మాజీ దేవాలయ చైర్మన్లు బొడ్డు నరేందర్, బూర్లే వీరబాబు, చెన్నా వీరభద్రం, గోగుల అంజయ్య, చారి, భాస్కర్ చారి, మెట్టెల లింగయ్య, ఉడుగు ఉదయ్, ముద్రబోయిన వెంకటేశ్వర్లు, ముద్రబోయిన నాగేశ్వరరావు, కొండపల్లి రామయ్య తదితరులు పాల్గొన్నారు.