calender_icon.png 4 February, 2026 | 12:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజేష్ మృతికి కారకులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలి

04-02-2026 10:37:16 AM

ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షులు  మందకృష్ణ మాదిగ

తుంగతుర్తి( విజయ క్రాంతి): కర్ల రాజేష్ ను చిత్రహింసలు గురిచేసి మృతికి కారకులైన పోలీసులపై చర్యలు తీసుకునేంతవరకు మా పోరాటం ఆగదని ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షులు పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్ల రాజేష్ సంతాప సభలో భాగంగా మొదట అంబేద్కర్, పూలే విగ్రహాలకు పూలమాలవేసి ఎమ్మార్పీఎస్ నాయకుల ర్యాలీతో, తుంగతుర్తి మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో సంతాప సభ, ఏర్పాటు చేసి, రాజేష్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు

. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నవంబర్ 4న ఎటువంటి కేసులు లేని రాజేష్ ను పట్టుకొని పోలీస్ స్టేషన్ తీసుకువచ్చి ఎస్ ఐ ,సి ఏ ల కుట్రలో భాగంగానే, పోలీసులు పోలీస్ స్టేషన్లో చిత్ర హంసలకు గురిచేసి, కోర్టుకు రిమాండ్కు పంపి, అనంతరం వైద్యం కోసం గాంధీ హాస్పిటల్ కు తరలించి, రాజేష్ మృతికి పోలీసులే కారకులయ్యారని దుయ్యబట్టారు. ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో పోరాటం చేస్తూ సాక్షాలను వెలికి తీసి, మానవ హక్కుల కమిషన్ లో పొందుపరిచి, నేడు రాజేష్ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు, పోరాటం తప్పదనే హెచ్చరించారు. ప్రస్తుతం పోస్టుమార్టం రిపోర్టును కూడా, పోలీసులు, స్థానిక ఎమ్మెల్యే మంత్రుల అండదండలతో, తారుమారు చేయటానికి ప్రయత్నిస్తున్నారని ఆయన విమర్శించారు. రాజేష్ మృతికి కారణాలు పూర్తి ఆధారాలు మా దగ్గర ఉన్నామని, నేటి వరకు పోలీస్ స్టేషన్ లోని సీసీ ఫుటేజ్ లు అందజేయడం లేదని ఆగ్రహం వ్యక్తం సుప్రీంకోర్టు ఆదేశాల మేనకో ప్రతి పోలీస్ స్టేషన్ లో ఎనిమిది నెల వరకు ప్రతి రికార్డు అందుబాటులోకి తేవాలని కోరారు.రాజేష్ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో పోరాటాలు జరుగుతాయని, ఇకనైనా మాదిగ సంబంధ జాతి ప్రజలు మేల్కొని, స్వచ్ఛందంగా పోరాటంలో పాల్గొనాలని కోరారు. అనంతరం ప్రజా యుద్ధనౌక ఏపూరి సోమన్న పాటలతో మాదిగ జాతిని మేల్కొల్పాడు. మాదిగ జాతే కాదు,సబండ జాతి ప్రజల కష్టాల పరిష్కారం కోసం పోరాటం చేసిన అలుపెరగని దీరుడు మందకృష్ణ మాదిగను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు గంగరాజు, భి ఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తాటికొండ సీతయ్య, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు గడ్డం ఖాసిం, సర్పంచులు మల్లె బాగా సాయిబాబా చింతకుంట్ల మనోజ్, తడకమల రవికుమార్, బొజ్జ సాయికిరణ్, నవీన్, తదితరులు పాల్గొన్నారు.