7 March, 2026 | 2:01 AM

వసతి గృహంలో విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవు

06-03-2026 01:34 PM

ఎంఈఓ నాగేశ్వరరావు...

బాన్సువాడ,(విజయ క్రాంతి): బాన్సువాడ పట్టణంలోని ఎస్టి గర్ల్స్ కళాశాల వసతి గృహంలో విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వహించకూడదని మండల విద్యాశాఖ అధికారి నాగేశ్వరరావు సూచించారు. శుక్రవారం మండల విద్యాశాఖ అధికారి నాగేశ్వరరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆదేశాల మేరకు వసతి గృహాన్ని తనిఖీ చేసినట్లు ఎంఈఓ నాగేశ్వరరావు తెలిపారు. వసతి గృహంలో విద్యార్థినీలకు వండిపెట్టిన భోజనాన్ని పరిశీలించారు. వసతి గృహం లోని వంటగది మరుగుదొడ్లు డైనింగ్ హాల్ ప్లే గ్రౌండ్ పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థినిల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని ఆయన సూచించారు. ఎంఈఓ వెంట వసతి గృహ వార్డెన్ అర్చన ఉన్నారు.