6 March, 2026 | 5:39 PM

మున్సిపాలిటీలో ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక

06-03-2026 01:36 PM

99 రోజుల కార్యాచరణ ప్రారంభం

కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ 

షాద్‌నగర్, (విజయక్రాంతి): పట్టణ అభివృద్ధి, ప్రజా సేవల మెరుగుదల లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమ ప్రారంభోత్సవ కార్యక్రమం షాద్ నగర్ పురపాలక సంఘం ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్(MLA Veerlapally Shankar) 99 రోజుల కార్యచరణ ప్రణాళిక కార్యక్రమాన్ని ప్రారంభించారు.మున్సిపల్ కార్యాలయంలో ఎమ్మెల్యే విల్లుపల్లి శంకర్ ప్రారంభించారు.

పట్టణ అభివృద్ధి, ప్రజా సేవల మెరుగుదల లక్ష్యంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సి.డి.ఎం.ఏ డైరెక్టర్ మమత కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ, 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక ద్వారా పట్టణాల్లో మౌలిక వసతుల అభివృద్ధి, పారిశుధ్యం, ప్రజా సమస్యల పరిష్కారం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు తెలిపారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు మున్సిపల్ సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సునీత రెడ్డి, మున్సిపల్ చైర్మన్ అగ్గనూర్ బసవేశ్వర్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బాబర్ ఖాన్, మున్సిపల్ వైస్ చైర్మన్ అందె మోహన్ పాల్గొన్నారు. షాద్ నగర్ పురపాలక సంఘం సమావేశాన్ని నిర్వహించగా పలువురు కౌన్సిలర్లు, అధికారులు హాజరయ్యారు. కార్యక్రమంలో పట్టణ అభివృద్ధి చర్యలపై చర్చించడంతో పాటు, వచ్చే 99 రోజుల్లో అమలు చేయనున్న పనులపై అధికారులకు మార్గదర్శకాలు ఇచ్చారు.