20-02-2026 06:13:52 PM
నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కేంద్రంలో నడుస్తున్న ప్రభుత్వ పాఠశాలను ఉద్దేశపూర్వకంగా మూత వేయించిన మండల విద్యాశాఖ అధికారిని వెంటవేపై శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఈరోజు డీఈవో కలసి వినతి పత్రం సమర్పించారు.
అదేవిధంగా జిల్లా విద్యాశాఖలో పాఠశాలల పర్యవేక్షణ కమిటీలలో ఉపాధ్యాయ సంఘం నాయకులను నియమించరాదని ఇంతకుముందే కమిటీలో నియామక పొందిన సంఘ నాయకులను తొలగించాలని డిమాండ్ చేశారు అదేవిధంగా పెండింగ్లో ఉన్న ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని డిఓ గారిని డిమాండ్ చేశారు కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘాల నాయకులు షేక్ షబీర్ అలీ భూక్య రాజేష్ నాయక్ క్రాంతి కుమార్ సాజిద్ లు పాల్గొన్నారు