హనుమాన్ విగ్రహానికి జలాభిషేకం
25-07-2026 08:31 PM
బీబీపేట,(విజయక్రాంతి): బీబీపేట మండలంలోని మాందాపూర్ గ్రామంలో వర్షాలు బాగా కురవాలని శనివారం గ్రామ పెద్దలు, గ్రామ సర్పంచ్ హరీష్ యాదవ్, ఉపసర్పంచ్ సంతోష్ రెడ్డి, పురోహితులు రాకేష్ శర్మ, వార్డ్ సభ్యులు వెంకట్ యాదవ్, రవీందర్, శ్రీనివాస్ రెడ్డి, మాధవరెడ్డిగ్రామ ప్రజల ఆధ్వర్యంలో గ్రామ చావిడి వద్ద ఉన్నటువంటి హనుమాన్ విగ్రహానికి జలాభిషేకం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామ ప్రజలు గ్రామ పెద్దలు ఆయా పార్టీల నాయకులు గ్రామ యువత పెద్ద సంఖ్యలో పాల్గొని ఊరు పోలిమేర నుండి బిందెల ద్వారా నీళ్లు తీసుకువచ్చ అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు గ్రామ గ్రామ ప్రజలు తెలియజేశారు.






