ఘనంగా బీరన్న బోనాలు
25-07-2026 08:04 PM
మహబూబాబాద్,(విజయక్రాంతి): ఆషాఢ శుద్ధ ఏకాదశి సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీరన్న దేవుడికి బోనాలు సమర్పించారు. కురుమ గొల్ల యాదవ సంఘం ఆధ్వర్యంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల్లోని వీరన్న దేవాలయానికి మహిళలు బోనాలతో తరలివచ్చి స్వామికి బోనం సమర్పించి, వర్షాలు సమృద్ధిగా కురిపించి, పాడిపంటలను చల్లగా కాపాడాలని, ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండేలా కరుణ చూపాలని కోరుకున్నారు.






