25 July, 2026 | 9:16 PM

చలో హైదరాబాద్ పోస్టర్ ఆవిష్కరణ

25-07-2026 08:25 PM

కోదాడ,(విజయక్రాంతి): తెలంగాణ ఆదర్శ పాఠశాల ఉపాధ్యాయ సంఘo ఆధ్వర్యంలో ఆగష్టు 1 న నిర్వహిస్తున్న చలో హైదరాబాద్ పోస్టర్ మునగాల మండలంలో ఉన్నత పాఠశాల గణపవరం, మునగాల మోడల్ స్కూల్, కస్తూరిభా గాంధీ స్కూల్ నందు శనివారం నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమం లో తెలంగాణా ఆదర్శ పాఠశాల ఉపాధ్యాయ సంఘo రాష్ట్ర కన్వీనర్ జమలాపురం రామకృష్ణ, తపస్ రాష్ట్ర బాద్యులు సుందరి శ్రీనివాస్, పోకల వెంకటేష్, నాగార్జునపు రాము పాల్గొనటం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.