25 July, 2026 | 9:18 PM

వైభవంగా తొలి ఏకాదశి వేడుక

25-07-2026 08:18 PM

ఘట్ కేసర్,(విజయక్రాంతి): తొలి ఏకాదశిని పురస్కరించుకొని ప్రజలు శనివారం ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఘట్ కేసర్ డివిజన్ పరిధి శివారెడ్డిగూడలోని శ్రీదండ్లగడ్డ వీరాంజనే యస్వామి ఆలయంలో తొలి ఏకాదశిని పురస్కరించుకొని దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో సత్యనారాయణస్వామి వ్రత కథ కార్యక్రమం బ్రాహ్మణోత్తముల మంత్రోచరణాల మధ్య అత్యంత వైభవంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి పాల్గొనడంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. ఆలయ చైర్మెన్ కొంతం రాంరెడ్డితో పాటు నాయకులు కొంతం అంజిరెడ్డి, కొంతం నర్సింహ్మరెడ్డి, భక్త జనులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.