19 May, 2026 | 1:03 AM

చెట్ల నరికివేతపై చర్యలు తీసుకోవాలి

19-05-2026 12:01 AM

అటవీశాఖ అధికారికి ఆర్జీఎన్ హ్యూమన్ రైట్స్ వినతిపత్రం

తంగళ్ళపల్లి, మే 18 (విజయక్రాంతి) : రాజన్న సిరిసిల్ల జిల్లా తంగ ళ్ళపల్లి మండలంలో ఆర్జీఎన్ హ్యూ మన్ రైట్స్ సభ్యులు పర్యటించి అటవీశాఖ అధికారికి వినతిపత్రం అంద జేశారు. ఈ సందర్భంగా వారు మా ట్లాడుతూ మండలంలో పెద్ద పెద్ద వృక్షాలను ఎలాంటి అనుమతులు లేకుండా నరికి వేస్తున్నారని ఆరోపించారు. దళారులు అక్రమంగా చెట్లను నరికివేసి పెట్టుబడులు లేకుండానే భారీగా సొమ్ము చేసుకుంటున్నారని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై అటవీశాఖ అధికారులు పట్టించుకోకుండా చూసీ చూడనట్టుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. తంగళ్ళపల్లి మండలంలో ప్రకృతిని జోరుగా నేలమట్టం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రస్తుతం 40 నుంచి 50 డిగ్రీల వరకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలకు చెట్ల నరికివేత కూడా ప్రధాన కారణమని తెలిపారు. భవిష్యత్ తరాలకు ఇది ఒక హెచ్చరిక అని, రానున్న రోజుల్లో చెట్లు లేకపోతే ఇతర దేశాల్లోలాగే ఆక్సిజన్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసుకోవాల్సిన పరిస్థితులు తలెత్తవచ్చని హెచ్చరించారు.ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం, ప్రజలపై సమానంగా ఉందని ఆర్జీఎన్ ఉమెన్ రైట్స్ యాంటీ కరప్షన్ అసోసియేషన్ సభ్యులు పేర్కొన్నారు. అక్రమ చెట్ల నరికివేతపై వెంటనే చర్యలు తీసుకోవాలని అటవీశాఖ అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ డి. మహిపాల్, వేములవాడ ఇంచార్జ్ రామకృష్ణ, కొనరావుపేట ఇంచార్జ్ మురళి, సభ్యులు పి. రామకృష్ణ, బి. శ్రీనివాస్, సిరిసిల్ల ఇంచార్జ్ పంజా బాలరాజు పాల్గొన్నారు.