19 May, 2026 | 2:09 AM

తాగునీటి సమస్యలను పరిష్కరించాలని వినతి

19-05-2026 12:00 AM

మేడిపల్లి (విజయక్రాంతి): మేడిపల్లిలో ఉన్న రెండు భారీ ట్యాంకులను నింపి, మేడిపల్లి, పీర్జాదిగూడ పరిధిలోని తాగునీటి సమస్యలను పరిష్కరించాలని మేడిపల్లి, పీర్జాదిగూడ డివిజన్ల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుంగతుర్తి రవి హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డ్, జనరల్ మేనేజర్ సంతోష్ కుమార్‌కు, డీజీఎం సరితకు ఉప్పల్ జోన్ హెచ్‌ఎండబ్ల్యూఎస్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సోమయ్య, నాగరాజు, పద్మారెడ్డి పాల్గొన్నారు.