శ్రీ చైతన్య ఆదిత్య పాఠశాలలపై తక్షణమే చర్యలు తీసుకోవాలి: డిఈఓ
శ్రీ చైతన్య, ఆదిత్య పాఠశాలలపై తక్షణమే చర్యలు తీసుకోవాలి
ఎంఈఓ నాగేశ్వరరావుకు ఆదేశాలు జారీ
యాజమాన్యాలపై నిబంధన మేరకు చర్యలు తప్పవు
జిల్లా విద్యాశాఖ అధికారి మల్లికార్జున్
బాన్సువాడ,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లాలో ప్రభుత్వ అనుమతి లేకుండా నిర్వహిస్తున్న పాఠశాలల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ తరగతులు నిర్వహించవద్దని జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈవో) మల్లికార్జున్ స్పష్టం చేశారు. ఈ మేరకు మండల విద్యాశాఖ అధికారులు, పాఠశాల యాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.
మంగళవారం బాన్సువాడ మండల కేంద్రానికి విచ్చేసిన డిఇఓ మల్లికార్జున్ కు బాన్సువాడ పట్టణంలోని శ్రీ చైతన్య ఆదిత్య పాఠశాలలకు అనుమతులు లేవని అదేవిధంగా చైతన్య పాఠశాలలో అనుమతులు లేకుండా తరగతులు నిర్వహిస్తున్నారని విజయ క్రాంతి అడగగా వెంటనే స్పందించిన డిఇఓ శ్రీ చైతన్య పాఠశాల ప్రిన్సిపాల్ కు ఫోన్ లో మాట్లాడి అనుమతి లేకుండా రేపటి నుండి తరగతులు నిర్వహించవద్దని వెంటనే నిలిపివేయాలని ఆదేశించారు.
అనుమతి లేకుండా పాఠశాలలను నిర్వహిస్తున్నట్లు గుర్తిస్తే వెంటనే తనిఖీలు నిర్వహించి, సోకాస్ నోటీసులు జారీ చేయాలని సంబంధిత యాజమాన్యాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మండల విద్యాశాఖ అధికారి నాగేశ్వరరావుకు ఆదేశించారు. అదేవిధంగా ఆదిత్య పాఠశాలకు బాన్సువాడ పట్టణంలోని ఎన్జీవోస్ కాలనీలో అనుమతులు పొంది సాయి కృపా నగర్ కాలనీలో పాఠశాల నిర్వహణ కొనసాగుతుందని తెలుపగా వెంటనే ఆ పాఠశాలకు సోకాస్ నోటీసులు జారీ చేయాలని ఎంఈఓకు ఆదేశించారు.
విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడే విద్యాసంస్థలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని హెచ్చరించారు.తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ అనుమతి పొందిన పాఠశాలల్లోనే చేర్పించాలని సూచించారు. ప్రవేశం కల్పించే ముందు సంబంధిత పాఠశాలకు ప్రభుత్వ గుర్తింపు ఉందో లేదో తప్పనిసరిగా నిర్ధారించుకోవాలని కోరారు.జిల్లాలో విద్యా ప్రమాణాలను పరిరక్షించడం, ప్రభుత్వ నిబంధనలను కచ్చితంగా అమలు చేయడం విద్యాశాఖ ప్రధాన లక్ష్యమని డీఈవో మల్లికార్జున్ పేర్కొన్నారు.






