18 August, 2026 | 5:06 AM

నార్త్ ఈస్ట్ చిట్స్ ఫండ్‌పై చర్యలు తీసుకోవాలి

18-08-2026 12:00 AM

చిట్స్ ఫండ్ బాధితుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు గారె వెంకటేష్

ముషీరాబాద్,ఆగస్టు 17(విజయక్రాంతి): నార్త్ ఈస్ట్ చిట్స్ ఫండ్ యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చిట్స్ ఫండ్ బాధితుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు గారె వెంకటేష్ ప్రభుత్వాన్ని కోరారు. సంస్థపై ఫిర్యాదు చేసినా సికింద్రాబాద్ చిట్స్ రిజిస్ట్రార్ కాలయాపన చేస్తున్నారని ఆరోపిస్తూ సంబంధిత అధికారిపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఎఫ్డీఆర్ లేకుం డా ‘జీరో చిట్స్’ నిర్వహిస్తూ సభ్యులను, ప్ర భుత్వాన్ని మోసం చేస్తున్నారని ఆరోపించారు. చిట్స్ సభ్యుల నుంచి అధిక పెనా ల్టీలు, జీఎస్టీతో పాటు 5 శాతం కంపెనీ కమిషన్ పేరుతో అక్రమ వసూళ్లు చేస్తున్నారని పేర్కొన్నారు. బాధిత సభ్యులు చిట్స్లో ఇకపై వాయిదాలు చెల్లించవద్దని సూచించారు.ఈ కార్యక్రమంలో బాధితుల ఫోరం నాయకులు యెవరి రమణ, రేవంత్, కుమార్, సా యికుమార్ పాల్గొన్నారు.