అధికారులు మారినా.. మారని గ్రామపంచాయతీ సమాచార బోర్డు
03-09-2026 | 03:20pm
భిక్కనూర్, సెప్టెంబర్ 3 (విజయక్రాంతి): అధికారులు మారుతున్నా గ్రామపంచాయతీ సమాచార బోర్డుపై పేర్లు మాత్రం మారడం లేదు. భిక్కనూర్ మండలం లక్ష్మీదేవునిపల్లి గ్రామపంచాయతీ గోడపై ఏర్పాటు చేసిన సమాచార హక్కు బోర్డుపై ఎంపీడీవో, ఎంపీఓ, పంచాయతీ కార్యదర్శుల పేర్లు ఏళ్లుగా మార్పులు చేయకుండా అలాగే దర్శనమిస్తున్నాయి. బోర్డుపై ఉన్న ఎంపీడీవో 2021లో, ఎంపీఓ 2024లో బదిలీ అయినట్లు సమాచారం. అయినప్పటికీ వారి పేర్లే కొనసాగుతుండడంపై గ్రామస్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు ఇప్పటికైనా స్పందించి పాత పేర్లను తొలగించి, ప్రస్తుత అధికారుల పేర్లను నమోదు చేయాలని కోరుతున్నారు.






