ఐక్య పోరాటాలతోనే రిజర్వేషన్ల సాధన
భారత్ వంటి ప్రజాస్వామ్య దేశంలో మెజారిటీ ప్రజలైన బీసీలకు చట్టసభలలో రిజర్వేషన్లు అమలు కాకుండానే స్వాతంత్య్రం వచ్చి 78 ఏళ్లు గడి చిపోయాయి. పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలను పెంచకముందే రాజ్యాంగ సవరణ చేపట్టి చట్టసభలలో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని ఉద్యమ నాయకులు గల్లీ నుంచి ఢిల్లీ వరకు పోరాడుతున్నారు. కానీ, బీసీ ప్రజాప్రతినిధులు మాత్రం ఈ అంశాన్ని చట్టసభలలో కనీసం ప్రస్తావించడం లేదు.
దీంతో వారి ధోరణిపై బీసీలు మండిపడుతున్నారు. ఇది జాతి ద్రోహం కా దా? అని ప్రశ్నిస్తున్నారు. బీసీ ప్రజాప్రతినిధుల మౌనం కారణంగా రిజర్వేషన్లలో మాత్రమే కాదు, బడ్జెట్ కేటాయింపుల్లోనూ బీసీలకు అన్యాయం జరు గుతోంది. దేశ జనాభాలో సగానికి పైగా బీసీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్ కేటాయింపుల్లోనూ బీసీలకు మొండిచెయ్యి చూపుతున్నాయి. అంతేకాదు, రిజర్వేషన్ల అమలు సరిగ్గా లేకపోవడంతో కేంద్రప్రభుత్వ రంగ సం స్థల్లో బీసీ ఉద్యోగుల ప్రాతినిధ్యం 10 శాతానికి మించి లేదు. రాజకీయ రం గంలో 14 శాతం దాటలేదు. సంపద సృష్టించడంలో ముందజలో ఉన్న బీసీలను విధాన నిర్ణయాధికారంలో విస్మరించడం తగదు.
ప్రతి ఎన్నికల ప్రచా రంలో బీసీలకు అండగా ఉంటామని హామీలిచ్చే నాయకులు వారి అనుయాయులకు, వారి అడుగులకు మడుగులొత్తే వారికి పద వులిచ్చి చేతులు దులుపుకొంటున్నారు. దానివల్ల బీసీలకు ఒరిగిందేమీ లేదు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య బీసిల హక్కుల కోసం 50 సంవత్సరాల నుంచి నిరంతర పో రాటం చేస్తున్నారు. ఆయన పోరాటం వల్లనే అగ్రకుల పాలకులు బీసీలను కనీసం గుర్తిస్తున్నారు.
అంతేకాదు, బీసీ ముఖ్యమంత్రులు ఉన్న రాష్ట్రాలలో కూడా అమలుకాని సంక్షేమ పథకాలు, గురుకుల పాఠశాలల ఏర్పా టు, ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాలు, స్థానిక సంస్థల ఎన్నికలలో రిజర్వేషన్లు తెలుగు రాష్ట్రాలలో బీసీలకు అమలవుతున్నాయి. బీసీలు ఉన్నత చదువులు అభ్యసించి ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో స్థిరపడుతున్నారు. ఉపాధి పొందుతున్నారు. అందుకే రాష్ట్రంలో వలసలు తగ్గిపోయాయి.
ఈ నేపథ్యంలో బీసీ ఉద్యమ నాయకులు చేస్తున్న పోరాటం యావత్ బీసీ సమాజాన్ని కది లించింది. 2025 డిసెంబర్‌లో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో బీసీల ఐక్యతను అందరం చూశాం. సర్పంచ్ ఎన్నికలలో రాష్ట్ర ప్రభుత్వం బీసీలు 17 శాతం రిజర్వేషన్లు అమలు చేసినా, జనరల్ స్థానాల్లోనూ బీసీలు తమ సత్తా చాటా రు. బీసీ అభ్యర్థులు సగానికిపైగా సర్పంచ్ స్థానాలను, తదుపరి జరిగిన మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో 60కి పైగా సీట్లలో విజయబావుటా ఎగురవేశారు.
బీసీల ఐక్యత వల్లనే ఇది సాధ్యమైంది. అయితే, బీసీ సామాజికవర్గానికి చెందిన మెజారిటీ కులాల ప్రజలు నేటికీ గ్రామ పంచాయతీ, అసెంబ్లీ, పార్లమెంట్ మెట్లు ఎక్కకపోవడం, బీసీలకు చట్టసభలలో రిజర్వేషన్లు లేకపోవడంతో ఇప్పటికీ అనేక కులాలు దోపిడీ, పీడనకు గురవుతున్నాయి. చట్టసభలలో బీసీలకు రిజర్వేషన్లు అమలైతే పాలనలో భాగస్వామ్యంతో పాటు నిర్ణయాధికారంలో బీసీలు కీలకపాత్ర పోషిస్తారు. అప్పుడే బీసీలకు సామాజిక న్యాయం జరుగుతుంది.
చట్టసభలలో రిజర్వేషన్ల సాధన కోసం ఉద్యమ నాయకులు చేస్తున్న పోరాటానికి మనమంతా మద్దతుగా నిలవాల్సిన అవశ్యకత ఉంది. బీసీ ఉద్యమ నాయకుల పోరాటానికి ప్రజాప్రతినిధుల మద్దతు కూడా తోడైతే ప్రభుత్వాలపై ఒత్తిడి పెరుగుతుంది. ఇప్పటికే బీసీలలో ఐక్యత మొ దలైంది. తమ హక్కుల సాధన కోసం బీసీలు పోరుబాట పడుతున్నారు. ఇ ప్పటికైనా పార్టీలకతీతంగా బీసీ నేతలంద రూ ఒక్కతాటిపైకి రావాల్సిన అవసరం ఉంది. ఐక్య పోరాటాలతో ప్రభుత్వాల మెడలు వంచి చట్టసభల్లో రిజర్వేషన్లు సాధించుకోవచ్చు. ప్రస్తుతం ఇదే బీసీల ఏకైక, అంతిమ లక్ష్యం.
బూర్గుపల్లి కృష్ణ యాదవ్
జాగృతి సేన వ్యవస్థాపక అధ్యక్షులు






