మియాపూర్‌లో దోపిడీ కేసు ఛేదన
డెలివరీ బాయ్‌పై దాడి చేసిన నిందితుడు అరెస్టు
శేరిలింగంపల్లి, జూలై 16 (విజయక్రాంతి): జెప్టో డెలివరీ బాయ్పు దాడి చేసి నగదు దోచుకున్న కేసును మియాపూర్ పోలీసులు ఛేదించారు. ఈ కేసులో బసోడి అభిషేక్ను అరెస్టు చేసి, అతని వద్ద నుంచి రూ.400 నగదును స్వాధీనం చేసుకున్నారు. మరో నిందితుడి కోసం గాలింపు కొనసాగుతోంది.
ఈ నెల 13వ తేదీ అర్ధరాత్రి గోపాల్రావు నగర్లో డెలివరీకి వెళ్తున్న యువకుడిని స్కూట్ప వచ్చిన ఇద్దరు దుండగులు అడ్డగించి దాడి చేశారు. బాధితుడి మొబైల్ను బలవంతంగా అన్లాక్ చేయించి బ్యాంకు ఖాతా నుంచి రూ.900 తమ ఖాతాకు బదిలీ చేయించడంతో పాటు జేబులో ఉన్న రూ.5 వేల నగదును అపహరించి పరారయ్యారు.సీసీటీవీ దృశ్యాలు, సాంకేతిక ఆధారాల సహాయంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడు బసోడి అభిషేక్ను అదుపులోకి తీసుకున్నారు.
విచారణలో సులభంగా డబ్బు సంపాదించేందుకు రాత్రివేళ ఒంటరిగా వెళ్లే వారిని లక్ష్యంగా చేసుకుని దోపిడీలకు పాల్పడినట్లు అతడు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. అభిష్పే మియాపూర్, మధురానగర్, జూబ్లీహిల్స్, గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ల పరిధిలో దోపిడీ, దొంగతనం కేసులు నమోదైనట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా కూకట్పల్లి జోన్ డీసీపీ మాట్లాడుతూ రాత్రివేళల్లో నిర్మానుష్య ప్రాంతాల్లో ఒంటరిగా ప్రయాణించవద్దని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు.






